భగవంతున్ని పూలు, పండ్లతో అలంకరించి ఆనందం పొందటం చూశాం కానీ కర్ణాటకాలో కాస్త భిన్నంగా భక్తిని చాటుకున్నారు ఓ ఆలయ నిర్వాహకులు. ఆలయాన్ని కరోనా మాస్కులు, పోషక పదార్థాలతో అలంకరించి భక్తులను ఆశ్చర్యానికి గురిచేశారు. గురు పౌర్ణమి సందర్భంగా చేసిన ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కరోనాపై ప్రజలకు అవగాహాన కల్పించేందుకే ఈ వినూత్న ప్రయత్నం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
#NewsOfTheDay
#EtvTelangana
ETVETVTeluguETV NewsVideo
0 Comments