ఐటీ చట్టంలోని పలు అంశాలపై బొంబాయి హైకోర్డు స్టే | Bombay HC stays | Various Aspects of New IT Act

ఐటీ చట్టంలోని పలు అంశాలపై బొంబాయి హైకోర్డు స్టే | Bombay HC stays | Various Aspects of New IT Act

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన నూతన ఐటీ చట్టంలోని కొన్ని అంశాలపై బొంబాయి హైకోర్టు స్టే విధించింది. ఆన్ లైన్ ప్రచురణ సంస్ధలు పాటించాల్సిన ప్రవర్తన నియమావళిని వివరించే ఈ చట్టంలోని కొన్ని భాగాలు......భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నాయని చెప్పేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. నూతన ఐటీ చట్టంలోని నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయని దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా బొంబాయి హైకోర్టు ఈ అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ప్రధాన ఐటీ చట్టం పరిమితిని దాటి కొత్త నిబంధనలు తీసుకువచ్చారని, రాజ్యాంగంలోని భావ ప్రకటన స్వేచ్ఛపై విధించదగ్గ సహేతుకమైన పరిమితులను దాటి ఇవి ఉన్నాయని పిటిషనర్ లు వాదనలు వినిపించారు. వాదనలు ఆలకించిన బొంబాయి హైకోర్టు.....నూతన ఐటీ చట్టంలోని క్లాజ్ -9లోని సబ్ క్లాజ్ ఒకటి, మూడులపై మధ్యంతర స్టే విధించింది. పిటిషనర్ ల భావ ప్రకటన స్వేచ్ఛను ఇవి ఉల్లంఘిస్తున్నట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది.

#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

ETVETVTeluguETV NewsVideo

Post a Comment

0 Comments