RAYALACHERUVU IN DANGER ZONE|ప్రమాదపు అంచున తిరుపతి రాయల చెరువు

RAYALACHERUVU IN DANGER ZONE|ప్రమాదపు అంచున తిరుపతి రాయల చెరువు

Tirupati: తిరుపతి రాయల చెరువు ప్రమాదపు అంచున ఉంది. నిండు కుండలా మారిన రాయల చెరువు నుంచి లీకేజీ అవుతున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికే సీకేపల్లి, రాయల చెరువుపేట, సూరావారి పల్లి, గొల్లపల్లి గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అనుపల్లి నుంచి రాయల చెరువుకు వరద ప్రవాహం ఎక్కువగా వస్తోంది. తూముల ద్వారా వెళ్లాల్సిన అవుట్‌ ఫ్లో తక్కువగా ఉంది. దీంతో చెరువుకు స్వల్ప గండి ఏర్పడింది.లీకేజీని ఆపేందుకు స్థానికులు ఇసుక బస్తాలను వేస్తున్నా.. వరద ఉధృతి ఆగడం లేదు. దీంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. గంగమ్మ శాంతించు అంటూ పూజలు చేస్తున్నారు. మరోవైపు అధికారులు.. ప్రజలెవరూ బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాయల చెరువు వద్దకు చేరుకొని, ప్రమాద పరిస్థితిని అధికారులకు అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్. ఇరిగేషన్ అధికారులతో పరిస్థితులను ఆయన సమీక్షించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు కలెక్టర్

SPECIAL THANKS TO SWAROOP

#tirupati
#heavyfloods
#heavyrain

RAYALACHERUVU IN dangerdanger zone for TIRUPATITirupati RAYALACHERUVU today

Post a Comment

0 Comments